మళ్లీ కొట్టాడు.... డబుల్‌ హ్యాట్రిక్‌కి అడుగు దూరంలో యంగ్‌టైగర్‌....!!!

మళ్లీ కొట్టాడు.... డబుల్‌ హ్యాట్రిక్‌కి అడుగు దూరంలో యంగ్‌టైగర్‌....!!!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గతంలో వరుసగా ఫ్లాప్‌లు డెలివర్‌ చేశాడు.. ఆయన సినిమాలకు ఓపెనింగ్స్‌ డౌన్‌ అయ్యాయి.. ఒకానొక దశలో 40 కోట్ల మార్క్‌ను అందుకోవడం చాలా టఫ్‌గా మారింది. అలాంటిది తారక్‌ నేడు సక్సెస్‌కి కేరాఫ్ అయ్యాడు.. బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలు.. మినిమమ్‌ సక్సెస్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్‌ నేడు.. వరసగా 5 విజయాలు డెలివర్‌ చేశాడు. 2015లో విడుదలయిన టెంపర్‌ నుండి లేటెస్ట్‌ అరవింద సమేత వీరరాఘవ వరకు తారక్‌ లైన్‌లో 5 సంచలన విజయాలు నమోదు చేశాడు బాక్సాఫీస్‌ దగ్గర. మరో హిట్‌ పడితే ఆయన డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్టే. ఆయన అప్‌కమింగ్‌ మూవీ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కావున సినిమా గ్యారంటీ హిట్‌ అనే నమ్మకం ఉంది... సో.. డబుల్‌ హ్యాట్రిక్‌ తప్పనిసరిలా కనిపిస్తోంది తారక్‌కి.. 
 
ఇటీవల వరసగా సక్సెస్‌లు ఇస్తున్న టాప్‌ హీరో ఒక్కరు లేరు.. మహేష్‌, పవన్‌,బన్ని, చెర్రీ, ప్రభాస్‌.. ఇలా ఏ టాప్‌  హీరో సైతం బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలు డెలివర్‌ చేయలేకపోతున్నారు. కానీ, తనను నమ్ముకున్న నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్‌లకు తారక్‌ లాభాల పంట పండిస్తూనే ఉన్నాడు.. రీసెంట్‌గా ఆయనను నమ్ముకొని చేతులు కాల్చుకున్న డిస్ట్రిబ్యూటర్‌లు ఒక్కరు లేరు.. ఇంకేం కావాలి ఏనిర్మాతకయినా.. టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనత గ్యారేజ్‌, జై లవకుశ.. తాజాగా అరవింద సమేత వీరరాఘవ.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలు బ్యాక్‌ డ్రాప్‌లు టెంపర్‌లో నెగిటివ్‌ రోల్‌తోనే మెప్పించాడు. ఇక, జై లవకుశలో ఆయనే విలన్‌... అయినా ప్రేక్షకులను ఫిదా చేశాడు.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌లో సటిల్‌ ప్లస్‌ బ్యాలెన్స్‌డ్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ఫిదా చేశాడు తారక్‌.. ఇదంతా ఆయన కథల ఎంపికతోనే సాధ్యం అయింది.. ఆచితూచి సినిమాలను ఎంచుకోవడం, తన ఇమేజ్‌ కంటే కథకే ఓటు వేయడం తారక్‌కి బాగా కలిసి వచ్చింది.. మరి, యంగ్‌టైగర్‌ రేంజ్‌ అరవిందతో ఎలా మారిపోతుందో చూడాలి.. 

RELATED NEWS

Comment