ఎన్టీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడా..?

ఎన్టీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడా..?

విమర్శల్ని తట్టుకోలేనోడు విజయాల్ని కూడా ఆస్వాదించలేడు అంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్టేటస్ లోనే ఉన్నాడు. తన లేటెస్ట్ మూవీ జై లవకుశ సక్సెస్ మీట్ లో ఎప్పుడూ లేని విధంగా క్రిటిక్స్ పై మండిపడ్డాడు. కొన్నాళ్ల క్రితం వరకూ వరుస డిజాస్టర్స్ తో నిర్మాతలను, బయ్యర్స్ ను బెంబేలెత్తించిన ఎన్టీఆర్... తనతో సినిమా తీసి నలభై కోట్లు లాస్ అయిన ఓ నిర్మాత హుస్సేన్ సాగర్ లో 
దూకినప్పుడు మాట్లాడని ఎన్టీఆర్.. కొన్ని సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ ఫెయిల్ అయిందని తనే ఒప్పుకున్న ఎన్టీఆర్.. నేను మారాను అంటూ చేసిన తప్పుల్ని తనే ఒప్పుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు 
విమర్శకులను ‘‘దారినపొయ్యే దానయ్యలు’’అంటున్నాడు. ఎందుకంటే జై లవకుశలో ఎన్టీఆర్ నటన అమోఘం అనే పేరు వచ్చినా.. కథ, కథనాల్లో పసలేదన్నది అందరికీ తెలిసిన నిజం.
 
అందరూ ఒప్పుకుంటోన్న వాస్తవం. ఆ వాస్తవాలే అతనికి నచ్చడం లేదు. ఎందుకంటే నిన్నటి వరకూ అంటే ఎవరో బయటి నిర్మాతల సినిమాలు. కానీ ఇప్పుడు తన సొంత అన్న సినిమా కదా. మరి బయటి వాళ్లు లాస్ అయితే డోంట్ కేర్.. మరి అన్న లాస్ కాకుండా లాట్ ఆఫ్ కేర్.. వాటే ఫీట్.. ఇక మీట్ లో అతను చెప్పిన పిట్టకథ వింటే అతనెంత వీక్ సినిమా చేశాడో మనకే అర్థమౌతుంది. చేసిందే ఏమాత్రం హెల్దీగా లేని సినిమా(మరి ఐసియూలో ఉందంటే దానర్థం అదే కదా). పాత కథకు కొత్త 
పర్ఫార్మెన్స్ యాడ్ చేసి మెప్పించాననుకుంటోన్న ఎన్టీఆర్.. ఈ స్టేజ్ పైనా భలే యాక్ట్ చేశాడులే. పైగా ఇది ప్రజాస్వామ్యం, అందరికీ మాట్లాడే హక్కుంది.. అంటూ కొన్ని కామెడీ డైలాగులు కూడా పేల్చాడు. 
 
ప్రేక్షకుల్ని డాక్టర్లతో పోల్చిన ఎన్టీఆర్.. విశ్లేషకులు కూడా ప్రేక్షకులే అనేది మర్చిపోయినట్టున్నాడు. అంటే విశ్లేషకులు కూడా డాక్టర్లే. వారికీ పేషెంట్ గురించి తెలుసు. అందుకే అతని కండీషన్ చెబుతారు. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పిన డాక్టర్ల కంటే ఈవిశ్లేషకులు(కొందరుమాత్రమే) ఇంకా సీనియర్స్. అందుకే నాడి చూడగానే ఆపరేషన్ అవసరమా లేక కష్టమా అని తేల్చేస్తారు.. మరి చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో.. నిజంగా సినిమా అంత పెద్ద హిట్ అయితే అంత హడావిడీగా మూడు రోజుల్లో ఇన్ని కలెక్షన్లు.. అంటూ అంత పెద్ద యాడ్స్ అవసరమా..? నిజంగానే సినిమాలో అంత దమ్ముంటే..
ఇంత త్వరగా సక్సెస్ మీట్ అవసరమా..? ఇప్పటికే ఫేక్ కలెక్షన్లు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. డిజే సినిమాలా జై లవకుశ కూడా అతి కలెక్షన్లతో అనవసరమైన సెటైర్స్ తెచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఐసీయూ, డాక్టర్లు, పేషెంట్స్ అంటూ దారిన పొయ్యే దానయ్యలతో పోల్చి మరిన్ని ఇబ్బందులు తెచ్చుకున్నట్టే.. అయినా ఫిదా, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల విషయంలో క్రిటిక్సేమీ తప్పులు చెప్పలేదే. ఈ సినిమాలోనూ కంటెంట్ విషయంలో కాస్త వీక్ ఉందని అన్నారే తప్ప ఎవరూ గట్టిగా అస్సలు బాలేదు అని కూడా 
చెప్పలేదు. అయినా ఇంత ఫైర్ అవుతున్నాడంటే.. వాళ్లు చూపిస్తోన్న ‘లెక్కల’కు ‘నిజంగా వస్తోన్న లెక్కలకు’ఏదో తేడా ఉన్నట్టుగా అనిపించడం లేదూ.. 
ఏదేమైనా దారినపొయ్యే దానయ్యలనూ పట్టించుకున్నాడంటే ఖచ్చితంగా ఆ దానయ్యలు చెప్పిన వాస్తవాలు ఈ బుడ్డోడికి మింగుడు పడటం లేదని అనుకోవచ్చు.. అయినా ఎన్టీఆర్ మాత్రమే కాదు..
ఈ మధ్య తరచూ విశ్లేషకులపై మండిపడిపోతోన్న సినిమావాళ్లకు ఓ మాట చెప్పాలి.. కోట్లుపెట్టి సినిమా తీశాం.. అనే మాటతో మాకేం పనిలేదు.. అసలవి మాకవసరం లేదు. మేం పెట్టే వందా నూటాయాభైతో  పాటు మేం మీ సినిమాల కోసం స్పెండ్ చేసే మూడు నాలుగు గంటల టైమ్.. మాకు మీ కోట్ల కంటే ఎక్కువ. అవి లాస్ అయితే.. ఖచ్చితంగా అంటారు బాస్.. అంటారు.

RELATED NEWS

Comment