పరిటాల ఇంటి కోడలు ఈమేనట!

పరిటాల ఇంటి కోడలు ఈమేనట!

దివంగత నేత - మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుటుంబంలో పెళ్లి బాజా మొగుతోంది. పరిటాల పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ అక్టోబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం ఈ నెల 10న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయినా పరిటాల శ్రీరామ్ ను మనువాడే అమ్మాయి పేరు జ్ఞానవి అని మాత్రమే ఇప్పటిదాకా మనకు తెలుసు. పరిటాల సొంత జిల్లా అనంతపురంలోని నార్పల మండలానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ - సుశీలమ్మల కుమార్తె జ్ఞానవి అని మాత్రమే వివరాలు వెల్లడయ్యాయి. 

అయితే వధువు ఫొటోను విడుదల చేసేందుకు పరిటాల సునీత ముందుగా అంతగా ఆసక్తి చూపలేదు. అయితే నిన్న కుమారుడి నిశ్చితార్థ వేడుకకు రావాలంటూ సునీత తన కొడుకును వెంటబెట్టుకుని వెళ్లి టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాబు చేతిలో ఆమె నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను కూడా పెట్టేశారు. ఈ పత్రిక ఆధారంగా సునీత ప్రమేయం లేకుండానే... ఆమె కాబోయే కోడలు ఫొటో ఇప్పుడు వెలుగులోకి వచ్చేసింది. 

ఉన్నత విద్యావంతురాలుగా కనిపిస్తున్న జ్ఞానవి... శ్రీరామ్కు తగిన జోడిగానే కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెడ్ కలర్ చుడీదార్ లో కళ్లద్దాలు పెట్టుకుని కూర్చున్న జ్ఞానవి ఫొటో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోందనే చెప్పాలి. ఈ నెల 10న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే నిశ్చితార్థ కార్యక్రమానికి రాజకీయ - సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 1న జరిగే వివాహంతో జ్ఞానవి పరిటాల ఇంటిలో పెద్ద కోడలిగా అడుగుపెట్టబోతోంది. 

RELATED NEWS

Comment