పవన్ కళ్యాణ్ తో వార్ కు సై అంటోన్న మహేష్ బాబు

పవన్ కళ్యాణ్ తో వార్ కు సై అంటోన్న మహేష్ బాబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఇండస్ట్రీ అంతా ఒకరకమైన వైబ్రేషన్ ఉంటుంది. అభిమానులైతే చెప్పక్కర్లేదు. పవన్ ను నడిచే దైవంగా కొలుస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ చూసి ఎంతో మంది పొలిటీషియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే 2019ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అనౌన్స్ చేసి ఆలోగా వీలైనన్ని సినిమాలు చేయడానికి ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ నేపథ్యంలో తన ఆప్తమిత్రుడు మాటల తూటా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.. త్రివిక్రమ్ కథతో పాటు మాటలకూ అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం నిజానికి దసరాకే విడుదలవుతుందనుకున్నారు. కానీ పవన్ పొలిటికల్ మీటింగ్స్ వల్ల లేట్ అయింది. దీంతో ఈ మూవీని సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడిదే మహేష్ తో వార్ కు కారణమైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు వాల్డ్ వైడ్ గా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. లేటెస్ట్ గా స్పైడర్ మూవీని ఫినిష్ చేసుకున్న మహేష్ ప్రస్తుతం తనకు శ్రీమంతుడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. భరత్ అను నేను అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ ఏకంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుండటం విశేషం. భరత్ అను నేను లో మహేష్ బాబు సిఎమ్ గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఆల్రెడీ అసెంబ్లీ సెట్ కూడా వేశారు. గతంలో దూకుడు సినిమాలో ఎమ్మెల్యేగా మెప్పించిన మహేష్ ఇప్పుడు సిఎమ్ గా చెలరేగబోతున్నాడు. పైగా కొరటాల శివ దర్శకుడు కావడంతో ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పుడే సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు. అంటే ఇప్పుడు సంక్రాంతికి మహేష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడన్నమాట. అంటే బాక్సాఫీస్ ఎంత షేక్ అవుతుందో వేరే చెప్పాలా.. ఎలాగూ ఫేస్ టూ ఫేస్ తలపడుతున్నారు కాబట్టి.. ఈ వార్ లో విన్నర్ ను బట్టే టాలీవుడ్ నెంబర్ వన్ చైర్ డిసైడ్ చేయొచ్చంటున్నారు కొందరు. ఏదేమైనా పవన్ వర్సెస్ మహేష్ అన్న సౌండే ఓ రేంజ్ లో ఉంది కదూ..

RELATED NEWS

Comment