అభిమానులకు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచన..!

అభిమానులకు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచన..!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ప్రస్తుత రాజకీయపరిస్థితులు గురించి మాట్లాడుతూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. నేను ఏ పార్టీ పక్షం కాదు ప్రజాపక్షం అంటూ పంచ్ డైలాగ్ లు విసురుతున్నారు. పనిలో పనిగా ఎన్నికలకు జనసైనికులను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తన అభిమానులకు పవన్ పలు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అనవసరంగా కొందరిని పెద్దవాళ్లను చేయొద్దని ఫ్యాన్స్ కు, కార్యకర్తలకు జనసేనాని సూచించారు. ఎవరైనా విమర్శలు చేస్తున్నప్పుడు పట్టించుకోవద్దన్నారు.
ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కొన్ని రోజుల తర్వాత అనవసరంగా కొందరిని పెద్దమనిషిని చేశామనే ఫీలింగ్ రాకతప్పదన్నారు. తనపై విమర్శలు గుప్పించిన వారైనా, తాను విమర్శలు చేసిన వారైనా ఎక్కడైనా ఎదురుపడితే బాగానే మాట్లాడుకుంటామని పవన్ తెలిపారు.
తనను ద్వేషించే వ్యక్తులు వారి అమూల్యమైన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లేనని పవన్ పేర్కొన్నారు. మనిషి నవ్వితే కొంతమేర కండరాలు కదులుతాయి, అదే ద్వేషిస్తే మాత్రం శరీరం పాడవుతుందని అన్న పవన్.. కార్యకర్తలు, ఫ్యాన్స్ సహనంతో ఉండాలన్నారు. కానీ మనం చచ్చిపోయేంత సహనం మాత్రం అవసరం లేదని, అంతటి సహనాన్ని తాను కూడా భరించలేనని చెప్పారు. అవసరమైన సందర్భాల్లో స్వీయ రక్షణ చేసుకుందామని పవన్ పిలుపునిచ్చారు.
కాగా, పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ గురించే అన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో పవన్ ను ఉద్దేశించి కత్తి మహేష్ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. దానికి పవన్ ఫ్యాన్స్ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కత్తిని ఏకిపారేస్తూ.. వార్నింగ్ లు ఇస్తున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన మహేష్.. పవన్పై మరింతగా విరుచుకుపడుతున్నాడు. ఇలా కత్తికి, పవన్ ఫ్యాన్స్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే. కత్తి మహేష్పై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశారని అభిమానులు అనుకుంటున్నారు

RELATED NEWS

Comment