పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్

పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్

పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్  కొట్టాడు.. ఎప్పుడు, దేంట్లో అనుకుంటున్నారా..? సినిమాల్లోనే. ఓ.. వరుసగా మూడు సినిమాలు పోయాయని హ్యాట్రిక్ అంటున్నారా..? అనుకుంటున్నారు కదూ.. నిజమే. కానీ ఈ హ్యాట్రిక్ ఆయన చేసిన సినిమాల గురించి కాదు.. ఆయన చూసిన సినిమాల గురించి.. యస్.. పవన్ కళ్యాణ్ పై కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అతను ఏ ఆడియో ఫంక్షన్ కైనా అటెండ్ అయితే.. ఇంక ఆ సినిమా డిజాస్టరే.. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా వినిపిస్తోన్న న్యూస్.. అయినా సినిమా పోవడానికి పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లడానికి సంబంధం ఏంటీ..? కదా.. కానీ ఇండస్ట్రీ అసలే సెంటిమెంట్స్ పుట్ట కదా. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ పై పడ్డారు. ఇంతకీ పవన్ అటెండ్ అయితే డిజాస్టర్ అయిన ఆ సినిమాలేంటీ.. ?
పవన్ కళ్యాణ్ సొంతం సినిమా అజ్ఞాతవాసి ఈ యేడాది విడుదలైంది. కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్ గా డిసైడ్ అయింది. ఆ తర్వాత అతను పొలిటికల్ గా బిజీ అయ్యాడు. ఇక ఇప్పుడప్పుడే సినిమాలు చేయను అని కూడా చెప్పాడు. కానీ మధ్యలో తను సమర్పించిన.. తన వీరాభిమాని సినిమా ఛల్ మోహన్ రంగా ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. 
తర్వాత అల్లుడు అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూ అటెండ్ అయ్యాడు. ఆ టైమ్ లో అతని కళ్లు బాలేదు.అయినా నల్ల కళ్లజోడు పెట్టుకుని మరీ వచ్చాడు. అంతకు ముందు పవన్ కు, బన్నీ ఫ్యాన్స్ మధ్య ఎండుగడ్డి వేస్తే భగ్గుమంది. కానీ పవన్ కళ్యాన్ ఫిలిమ్ ఛాంబర్ డ్రామాలో అల్లు అర్జున్ హడావిడీగా అటెండ్ అయ్యాడు. దీంతో తమ ఫ్యామిలీలో ఏ గొడవా లేదని చెప్పడానికి అతను వచ్చాడు.. అది నిజమే అని నిరూపించడానికి పవన్ కళ్యాణ్ నా పేరు సూర్య ఫంక్షన్ కు వెళ్లాడు. కట్ చేస్తే సూర్య బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. 
ఇక ఇప్పుడు నేల టిక్కెట్టు.. మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్లాడు. నిర్మాత రామ్ తాళ్లూరి తెలుసని, దర్శకుడితో స్నేహం ఉందని చెప్పాడు కూడా. ఆ స్నేహం కొద్దీ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ ఫంక్షన్ లో చాలాకాలం తర్వాత చాలా అంటే చాలా జోష్ గా కనిపించాడు. మొత్తంగా నేల టిక్కెట్టు ఆడియోకే హైలెట్ గా నిలిచాడు పవన్.. కానీ ఇవాళ విడుదలైన నేల టిక్కెట్టు యూనానిమస్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 
దీంతో పవన్ కళ్యాణ్ ఏ సినిమా విడుదలకు ముందైనా ఫంక్షన్ కు అటెండ్ అయితే ఆ సినిమా ఖతం అనే సెంటిమెంట్ స్ప్రెడ్ అవుతోంది. అసలే ఇలాంటివి విపరీతంగా ప్రచారం పొందుతాయి. అయితే ఖచ్చితంగా మాట్లాడితే పోయిన సినిమాలకు పవన్ కళ్యాణ్ అటెండెన్స్ కూ లింక్ పెట్టడం అంటే మింగలేక మంగళవారం అన్నట్టే అనుకోవచ్చు... అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయ్.. 

RELATED NEWS

Comment