ప్రభాస్ జేమ్స్ బాండ్ గా వస్తున్నాడా..?

ప్రభాస్ జేమ్స్ బాండ్ గా వస్తున్నాడా..?

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న సాహో కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇట్స్ షో టైమ్ అంటూ రిలీజ్ చేసిన టీజర్ తో ఫీవర్ పెంచిన సాహో టీమ్ ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం వినిపిస్తోన్న వార్తలను బట్టి ప్రభాస్ ఓ స్పై గా నటిస్తున్నట్టు సమాచారం. బాహుబలి ఇచ్చిన క్రేజ్ ను సాహోతో కంటిన్యూ చేయాలనే ఈ మూవీని మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ భారీగా రిలీజ్ చేయబోతోన్న సాహో కోసం ఓ కాస్ట్ లీ కార్ ను వాడుతున్నారట.. ఈ కార్ ప్రభాస యూజ్ చేస్తాడట సినిమాలో.
రన్ రాజా రన్ వంటి ఒకే ఒక్క సినిమా తీసిన సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సాహో ను ప్రభాస్ ఫ్రెండ్స్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. 150కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్ వాడే కార్ ఖరీదు 6కోట్లట. సినిమాలో ఈ కార్ కూడా కొంత కీలకంగా ఉంటుందని టాక్. అంటే జేమ్స్ బాండ్ తరహా కార్ అనుకోవచ్చనే హింట్స్ వస్తున్నాయి. ఈ కార్ లోనే ప్రభాస్ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నీ ఉంటాయట. గన్స్, నైఫ్స్, బాంబ్స్ .. అన్నీ ఈ కార్ లో ఇంటర్నల్ గా ఫిక్స్ అయి ఉంటాయట. సో.. కార్ కథను బట్టి చూస్తే ప్రభాస్ చేస్తున్నది జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టరే అనేది ఇన్ డైరెక్ట్ గా తేలిపోతున్నట్టే కదా..

RELATED NEWS

Comment