ప్రదీప్‌ కొంపముంచుతున్న పెళ్లిచూపులు....!!!

ప్రదీప్‌ కొంపముంచుతున్న పెళ్లిచూపులు....!!!

ప్రదీప్‌.... తెలుగు బుల్లితెర టాప్‌ మేల్‌ యాంకర్‌.. సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మి వంటి లేడీ యాంకర్‌లే డామినేట్‌ చేస్తున్న బుల్లితెరపై వారికి ధీటుగా రాణిస్తోన్న ఏకైక మేల్‌ యాంకర్‌ ప్రదీప్‌.. ఎక్కడా డబుల్‌ మీనింగ్‌ డైలాగులు లేకుండా, ఫ్యామిలీలు కలిసి కూర్చునేలా షోలు చేయడం ప్రదీప్‌ స్పెషాలిటీ. కాంట్రవర్శీలకు కూడా బహుదూరం ప్రదీప్‌. అలాంటి ప్రదీప్‌ సడెన్‌గా తన తాజాగా పెళ్లిచూపులు షోతో వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాడు.. 
 
బిగ్‌ బాస్‌ సెకండ్‌ సీజన్‌లో వచ్చిన రేటింగ్‌ని కాపాడుకోవడానికి, తెలుగులో సరికొత్త ప్రోగ్రామ్‌ పేరుతో తెలుగు బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అయిన ప్రదీప్‌తో పెళ్లిచూపులు కార్యక్రమం షురూ చేసింది స్టార్‌ మా.. ఈ ప్రోగ్రామ్‌కి 14 మంది అందమైన అమ్మాయిలను సెలెక్ట్‌ చేసింది. వారిలో ఫైనల్‌గా ఎవరు గెలుస్తారో, ప్రదీప్‌ మనసు గెలుచుకుంటారో ఆమెను ప్రదీప్‌ మ్యారేజ్‌ చేసుకుంటాడు.. అంటే స్వయంవరం లాంటి ప్రోగ్రామ్‌ ఇది.. ఈ కార్యక్రమంలో ఈ వీకెండ్‌న ప్రదీప్‌తో చేసిన ఎపిపోడ్‌ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది.. ఈ షోలో 14 మంది అమ్మాయిల నడుము, లిప్స్‌ ఫోటోస్‌ కట్‌ చేసి అవి ఎవరెవరివో ప్రదీప్‌ కనిపెట్టాలి. అవి ఎవరివో  ఫైండ్‌ అవుట్‌ చేస్తే ప్రదీప్‌కి ఆమెపై అంత లవ్‌ ఉన్నట్లు.. కానీ, ఆ ఫోటోలు, నడుము, వీపు భాగాలని కట్‌ చేసి స్క్రీన్స్‌పై ఫోకస్‌ చేయడం అడల్ట్‌ కంటెంట్‌ని తలపిస్తోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. రేటింగ్‌ని పెంచుకోవడానికి ఇలాంటి ఎక్‌స్ట్రాలను ప్రోత్సహిస్తోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. మొత్తమ్మీద, తాను ఇన్ని రోజులు కాపాడుకున్న క్లీన్‌ అండ్‌ ఫ్యామిలీ ఇమేజ్‌ని పెళ్లిచూపులు కార్యక్రమం చెరిపేస్తుందనే టాక్ నడుస్తోంది.. మరి, రేటింగ్స్‌ కోసం ప్రదీప్‌ ఇలానే కంటిన్యూ చేస్తాడా...? లేక వివాదాలకు ఎండ కార్డ్‌ వేస్తాడా..? అనేది చూడాలి.. 

RELATED NEWS

Comment