ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌రాజ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌రాజ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ కలిశారు. ఈ రోజు సీఎం కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. అనంతరం ప్రకాశ్‌రాజ్‌ అసెంబ్లీని సందర్శించారు. భాజపా, కాంగ్రెస్‌ యేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్‌ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌ ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కోల్‌కతాకు వెళ్లి బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఫెడరల్ ‌ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు. మరిన్ని రాజకీయ పక్షాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కూడా సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో సీన్ కేసీఆర్‌ను ఆయన కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED NEWS

Comment