రాష్ట్రపతి విశాఖ పర్యటన

రాష్ట్రపతి విశాఖ పర్యటన

భారత దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 7, 8 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
సిఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌ ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో ఆయన వెంట ఉంటారు.7న మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ ఎయిర్‌ఫోర్స్‌ కార్యాలయం ఐఎన్‌ఎస్‌ డేగాకు విచ్చేస్తారు. సాయంత్రం 5గంటలకు ఆంధ్ర యూనివర్సిటీలోని రూ.9కోట్లతో స్టార్టప్‌ కంపెనీ భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం విశాఖ నగరంలోని బుల్లయ్యకళాశాల సమీపాన గల డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ మెమోరియల్‌ పాఠశాలలో జరిగే కార్యక్రమం, పిల్లలతో ఇంటరాక్షన్‌లో రాష్ట్రపతి పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం తూర్పునౌకాదళంలోని గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. తూర్పునౌకాదళ సబ్‌మెరైన్‌ అధికారుల బృందం ఏర్పాటు చేసేన నేవీ స్టాంపును విడుదల చేస్తారు.జలాంతర్గామి విభాగం ఏర్పాటై 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్టాంపులను విడుదల చేయనున్నారు.రాత్రి నౌకాదళంలోని రాజ్‌పుథ్‌లో విందుకు హాజరవుతారు.

ఈ విందులో సిఎం, గవర్నర్‌ పాల్గొననున్నారు. రాత్రి ఇఎన్‌సిలోనే రాష్ట్రపతి బస చేస్తారు.

RELATED NEWS

Comment