రిషిగా  సూపర్‌స్టార్‌

రిషిగా సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 25వ సినిమా పేరేంటి? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిగా చర్చించుకుంటున్న అంశమిది. గతవారం రోజులుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్‌ 25వ సినిమా గురించే చర్చ. మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈనెల 9న మహేష్‌ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలని భావిస్తోంది చిత్రబృందం.

అందుకు తగ్గట్టే చిత్ర బృందం సర్‌ప్రైజ్‌లు ఇస్తుంది. సినిమా కు సంబంధించిన రోజుకో కొత్త అక్షరాన్ని పోస్టర్ల రూపంలో విడుదల చేస్తోంది చిత్ర యూనిట్‌. ఇప్పటివరకూ ‘ఆర్’, ‘ఐ’, ‘ఎస్’, ‘హెచ్’ అక్షరాలను విడుదల చేశారు డైరెక్టర్ వంశీ పైడిపెల్లి. అవి టైటిల్ కు లింక్ అయ్యి ఉంటాయని సిబిఐ రేంజ్ లో దాన్ని డీ కోడ్ చేయటం మొదలుపెట్టారు అభిమానులు.

RELATED NEWS

Comment