సాయిధరమ్ తేజ్ కోతలకు అంతే ఉండదా..?

సాయిధరమ్ తేజ్ కోతలకు అంతే ఉండదా..?

మెగా ఫ్యామిలీ నుంచి మేనమామల పోలికలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు సాయిధరమ్ తేజ్. పోలికల్లోనే కాదు.. డ్యాన్సుల ట్యాలెంట్ లో చిరంజీవిని గుర్తు చేసే తేజూ ఆ మధ్య వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి ఎట్రాక్ట్ చేసినా తర్వాత తిక్క సినిమాలతో గాడి తప్పాడు. బాక్సాఫీస్ వద్ద విన్నర్ కాలేక చతికిలపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సాయి నటించిన నక్షత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. అలాగే వివి వినాయక్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేస్తోన్న తేజూ ఇప్పుడు అందరి ముందూ తెగ కోతలు కోయడానికి రెడీ అవుతున్నాడు.. అది కూడా దర్శకుడి అండ చూసుకుని కావడం విశేషం..
సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్ లో సినిమా సెట్ అయిందట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోయే ఈ సినిమాలో తేజూ ‘‘కోతలరాయుడు’’గా కనిపిస్తాడట. కోతలరాయుడు పేరుతో చిరంజీవి ఓ సినిమా చేశాడు. ఇందులో తేజూ అబద్ధాలు చెప్పకుండా అందరి ముందూ కోతలు కోస్తూ పబ్బం గడుపుకునే గడుసుకుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడట. అబద్ధం ఆడకుండా కోతలు కోయడం సాధ్యం కాదు కదా అనుకోవచ్చు.. కానీ ఈ సినిమాలో అదే హైలెట్ అంటున్నాడట డైరెక్టర్ మారుతి. క్యారెక్టర్ కోతలరాయుడైనా.. సినిమా టైటిల్ మాత్రం మళ్లీ మామనే వాడేస్తున్నాడీ అల్లుడు. మహానగరంలో మహామాయగాడు అనేదే టైటిల్.సో మేనల్లుడు మెగాస్టార్ ను ఫుల్లుగా వాడేయడానికే ఫిక్స్ అయ్యాడన్నమాట..

RELATED NEWS

Comment