జగన్‌కి అత్యంత సన్నిహిత పాత్రికేయుడి ఇంట్లో విషాదం.... కన్నీరుపెట్టుకున్న భారతి, సాక్షి టీమ్‌...!!

జగన్‌కి అత్యంత సన్నిహిత పాత్రికేయుడి ఇంట్లో విషాదం.... కన్నీరుపెట్టుకున్న భారతి, సాక్షి టీమ్‌...!!

 
సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని ఇంట్లో విషాదం... కుమారుడి మృతి...!!
 
 
ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తనయుడు శ్రీహర్ష చనిపోయారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌ బాధపడుతున్న శ్రీహర్ష సోమవారం మృతిచెందాడు. కొమ్మినేని శ్రీనివాసరావుకు శ్రీహర్ష ఒక్కడే కుమారుడు.. 32 ఏళ్ల శ్రీహర్ష సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌.. వృత్తిరీత్యా కెనడాలో సెటిల్‌ అయ్యాడు.. నాలుగేళ్ల క్రితం తన తనయుడుకి గ్రాండ్‌గా వివాహం జరిపించాడు కొమ్మినేని.. ఇటీవల క్యాన్సర్‌ బారిన పడడంతో శ్రీహర్ష కోలుకోలేకపోయారు.. దీంతో, మరణం సంభవించిందని సన్నిహితులు చెబుతున్నారు.. కొడుకు మృతితో కొమ్మినేని కుటుంబంలో విషాదం అలముకుంది. శ్రీహర్షకు సీరియస్‌గా ఉందని తెలియడంతో కొమ్మినేని ఆయన భార్య రెండు రోజుల క్రితం కెనడా వెళ్లారు. కొడుకుతో అంతిమక్షణాలను గడపాలని వారు భావించారు.  వారసుడు కళ్లెదుటే చనిపోవడం ఏతండ్రికయినా భరించడం అంత చిన్న విషయం కాదు.. 
 
 
కొమ్మినేని ప్రస్తుతం సాక్షి మీడియాలో పనిచేస్తున్నారు. మార్నింగ్‌ పేపర్‌ న్యూస్‌ల సమాహారంతో ప్రసారమయ్యే లైవ్‌షో విత్‌ కేఎస్‌ఆర్‌ని ఆయనే డీల్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్‌ ఉంది.. అంతేకాదు, వీకెండ్‌న టెలికాస్ట్‌ అయ్యే ఇంటర్‌వ్యూ బేస్డ్‌ ప్రోగ్రామ్‌ మనసులో మాటను కొమ్మినేని చేస్తున్నారు.. ప్రముఖ సెలబ్రిటీలతో జరిపే ఈ ఇంటర్‌వ్యూకి మంచి వ్యూయర్‌షిప్‌ ఉంది.. గతంలో ఆయన ఓ చానెల్‌లో ఆయనకు విబేధాలు రావడంతో బయటకు వచ్చారు... కొమ్మినేని ఇంట్లో జరిగిన ఘటనతో సాక్షి టీమ్‌లో విషాదం నెలకొంది. కొమ్మినేనిని వైసీపీ అధినేత జగన్‌ పిలిచి మరీ తన చానెల్‌ సాక్షిలో స్థానం ఇచ్చారు. ఆయన జగన్‌తోపాటు భార్య భారతికి సైతం అత్యంత సన్నిహితులలో ఒకరిగా చెబుతారు.. అందుకే, కొమ్మినేని కుటుంబంలో మరణంతో భారతి కన్నీరు పెట్టుకున్నారట. ఈ వయసులో కొమ్మినేనికి కలిగిన నష్టం, కష్టం ఎవరూ తీర్చలేనిదని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. జగన్‌ సైతం కొమ్మినేనికి ఫోన్‌ చేసి పరామర్శించారు.. పలువురు సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని కుమారుడి మృతికి నివాళి తెలిపారు.. శ్రీహర్ష మృతదేహం నేడో రేపో కెనడా నుండి ఇండియాకి రానుంది.. 

RELATED NEWS

Comment