ఆ దేశంలో రెండో పెళ్లి చేసుకొంటే ఇంటి అద్దె.. ఫ్రీ...

ఆ దేశంలో రెండో పెళ్లి చేసుకొంటే ఇంటి అద్దె.. ఫ్రీ...

మనదేశంలో రెండో పెళ్లి చేసుకొంటే చట్టరీత్యా నేరంగా పరిగనిస్తారు. కానీ కొన్ని దేశాల్లో బహుభార్యత్వం అమలు లోఉంది మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌లో బ‌హుభార్యత్వం అనేది చ‌ట్ట‌బ‌ద్ధం. ఒక్కో వ్య‌క్తికి ఒక‌రి కంటే ఎక్కువ మంది భార్య‌లు ఉండ‌టం అక్క‌డ చ‌ట్ట‌బ‌ద్ధం. ఇక కొన్ని ఆఫ్రికా దేశాలతో పాటు.. కామెరూన్ వంటి దేశాల్లో కూడా బహుభార్యత్వం అమలు లో ఉంది. ఇక టాంజానియా అనే దేశంలో అయితే భర్తను మరొక మహిళతో పంచుకోవడం వల్ల మహిళలకు, వాళ్ల పిల్లలకు సంపద పెరుగుతోందని నమ్ముతారు. అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఎక్కువమంది భార్యలుండడం నేరంగా పరిగణించరు అన్నమాట... కాగా తాజాగా ఇద్దరు భార్యలున్న భర్తలకు ఆ దేశంలోని ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నది. మరి ఆ దేశం ఏమిటో ఎక్కడ ఉందొ తెలుసా...!

అదే యుఎఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన దేశం యూఏఈ. ఇక్కడ ఇద్దరు ఒక వ్యక్తీకి ఇద్దరు భార్యలుంటే చాలా గౌరవంగా భావిస్తారు. ఇలా ఒక మగాడు రెండు పెళ్లి చేసుకోవడాని ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తున్నది. మీడియాకు తెలిసిన సమాచారం మేరకు... యూఏఈ లో అవివాహిత మహిళల సంఖ్య అధికంగా ఉన్నదట.. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం బహుభార్యత్వం ను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు.. ఇలా రెండో పెళ్లి చేసుకొన్న వ్యక్తికి అనేక బహుమతులను కుడా అందిస్తున్నది. ముఖ్యంగా ఆ దేశంలో రెండో పెళ్లి చేసుకొన్న పురుషులకు షేక్ జాయద్ హౌసింగ్ పథకం కింద ఇంటి అద్దెను చెల్లిస్తున్నదట.. అంతేకాదు.. ఆ వ్యక్తి రెండో భార్యగా వచ్చిన మహిళలకు కూడా అనేక ప్రయోజనాలు అందిస్తున్నదట అక్కడ ప్రభుత్వం..

RELATED NEWS

Comment