హోదాపై సినీ నటులు స్పందించమని విద్యార్ధుల వినూత్న నిరసన

హోదాపై సినీ నటులు స్పందించమని విద్యార్ధుల వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాజకీయ నేతలు, స్టూడెంట్స్ తదితరులు ఆందోళన నిర్వహిస్తున్నా... ఏపీకి ప్రత్యేక హోదాపై సినీ నటులు మాత్రం స్పందించడం లేదు. దీంతో సినీ నటులు హోదాపై స్పందించాలని.. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ముందు టీఎస్ఎస్ఎఫ్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్టూడెంట్స్ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు తదితరుల ఫోటోలను వారు మెడలో ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో విద్యార్ధులు మాట్లాడుతూ.. రెండు రోజుల్లో సినీ తారలు కనుక ప్రత్యేక హోదాపై నోరు తెరవక పోతే వారు నటించిన సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. తమ సంప్రదాయం నిలబెట్టుకోవడం కోసం తమిళ ప్రజలు చేసిన జల్లి కట్టు ఉద్యమానికి సినీ హీరోలందరూ మద్దతు తెలిపారు.. మరి ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని వంటిది..దీనిపై స్పందించని మన తెలుగు హీరోల గురించి ఏ విధంగా మాట్లాడాలి అని వేదన వ్యక్తం చేశారు.

RELATED NEWS

Comment