తమ్ముడు కి సవాల్ విసిరిన అన్నయ్య

తమ్ముడు కి సవాల్ విసిరిన అన్నయ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ విసిరారు. ఆయన విసిరింది రాజకీయానికి సంబంధించిన ఛాలెంజో.. లేదంటే సినిమాలకు సంబంధించిన ఛాలెంజో కాదులెండి. గ్రీనరీకి సంబంధించిన ఛాలెంజ్. ఓ ఛానల్ అధినేత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరు.. మూడు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా తాను కూడా పవన్ కల్యాణ్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి హరితహారం ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ''నాకు వచ్చిన ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తూ.. మా ఇంటి పెరట్లో మూడు మొక్కలను నాటాను. ఈ సందర్భంగా నేను మరో ముగ్గురు ప్రముఖులను ఎంచుకుని... నేను వాళ్లను నామినేట్ చేస్తున్నాను ఈ గ్రీన్ ఛాలెంజ్‌కి. ఆ ప్రముఖులెవరో కాదు. అమితాబ్ బచ్చన్ జీ, పెద్దలు రామోజీరావుగారు, నా తమ్ముడు పవన్ కల్యాణ్. వీళ్లు ముగ్గురు నా ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తారని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారని ఆశాభావంతో ఉన్నాను. అమితాబ్ బచ్చన్ జీని నామినేట్ చేస్తున్నాను.

సార్ ప్లీజ్ గ్రీన్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయండి. ఇండియా మిమ్మల్ని ఫాలో అవుతుంది'' అని పేర్కొన్నారు.

RELATED NEWS

Comment