ఆ నిర్మాత ఏడాదిపాటు హింసించాడు... బాంబ్‌ పేల్చిన లక్స్‌ పాప....!!!

ఆ నిర్మాత ఏడాదిపాటు హింసించాడు... బాంబ్‌ పేల్చిన లక్స్‌ పాప....!!!

లక్స్‌ పాప గుర్తుందా....? నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ భామ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. జగపతిబాబు, వడ్డే నవీన్‌, శ్రీకాంత్‌ సరసన హీరోయిన్‌గా నటించిన ఆశా షైనీ తాజాగా ఓ బాంబ్‌ పేల్చింది.. తనను కొన్నేళ్ల క్రితం గౌరంగ్‌ దోషి అనే నిర్మాత తీవ్రంగా హింసించాడని వివరించింది.. గౌరంగ్‌ దోషి ఆమె మాజీ ప్రియుడు.. నిర్మాత కూడా.. 2007లో జరిగిన ఈ వివాదం గురించి తాజాగా ఆమె తన సోషల్‌ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌లో సంచలన విషయం తెలిపింది.. మీ టూ బాధితులలో తాను ఒకరని వివరించింది. తనకు తగిలిన గాయాలతో ఉన్న ఫోటోలను పోస్ట్‌ చేసి ఇలా రాసింది.. 
 
‘‘అది నేనే. 2007లో ప్రేమికుల దినోత్సవం నాడు గౌరంగ్ దోషి నన్ను దారుణంగా కొట్టాడు. ఒక సంవత్సరం పాటు నాకు నరకం చూపించాడు. అప్పుడు నా దవడ ఫ్రాక్చర్ అయింది. ఆ సమయంలో నేను ఇదంతా బయటపెట్టాను. కానీ ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో గౌరంగ్‌కు బాగా పలుకుబడి ఉండేది. నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తానని చాలా సార్లు బెదిరించాడు. కొన్ని సందర్భాల్లో నన్ను సినిమాల్లోకి తీసుకున్నట్లే తీసుకుని తొలగించిన రోజులూ ఉన్నాయి. నన్ను ఆడిషన్స్‌కు కూడా పిలవడానికి ఇష్టపడేవాళ్లు కాదు. అప్పుడు నేను తప్పు చేశానని నాకు అర్థమైంది.
 
ఆ క్షణాన నేను నోరుతెరవకుండా ఉండాల్సింది అనిపించింది. కేవలం నా ప్రతిభ చూసి అవకాశాలు ఇచ్చే వారు ఎవరైనా ఉంటే వారి వద్దకు పారిపోయి తలదాచుకోవాలని అనుకున్నాను. నేనే కాదు నాలాంటి ఎందరో ఆడవాళ్లు గౌరంగ్‌ కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వారంతా నాకు ఫోన్లు చేసి సాయం చేయమని అడిగారు. కానీ నేను ఆ ధైర్యం చేయలేకపోయాను. తమ పట్ల జరిగిన దారుణాల గురించి బయటపెడుతున్నవారి కోసం నేను ఈ పోస్ట్‌ పెడుతున్నాను.`` అని పోస్ట్‌ చేసింది.. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ పలువురు హీరోయిన్‌లు తమను లైంగికంగా వేధించిన కొందరి సీక్రెట్లను బయటపెడుతున్నారు.. ఫ్లోరా షైనీ మరెన్ని బాంబులు పేలుస్తుందో చూడాలి.. 
 

RELATED NEWS

Comment