'బిగ్ బాస్' విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' విజేత శివబాలాజీ

తెలుగు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన  మా టీవీ రియాల్టీ షో 'బిగ్ బాస్' విజేతగా  శివబాలాజీ  నిలిచారు .ఫైనల్ ఎలిమినేషన్  అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది ఐదుగురి నుంచి ఒక్కరుగా ఎలిమినేషన్ అవుతూ చివరి వరకు ఉన్న శివబాలాజీ విజేతగా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీని   సొంతం చేసుకున్నారు .బిగ్ బాస్ షో లో  సినీ తారలు శివ బాలాజి , నవదీప్ , అర్చన ,హరితేజ, ఆదర్శ్ , జ్యోతి, ముమైత్ ఖాన్, దీక్ష పంత్ , ప్రిన్స్ , సమీర్, సంపూర్నేష్ బాబు , కామెడియన్ ధనరాజ్, టివి హోస్ట్ కత్తి కార్తీక ,సింగర్ మధు ప్రియా, కల్పన రాఘవేంద్ర , సినీ విమర్శకులు మహేష్ కత్తి    పాల్గొనగా చివరికి శివ బాలాజి , నవదీప్ , అర్చన ,హరితేజ, ఆదర్శ్ ,ఫైనల్స్ కు చేరారు .బిగ్ బాస్ తొలి సీజన్ 10 వారాలు జరిగింది.   తెలుగు వారికి 'బిగ్ బాస్' షో చాలా కొత్త. జులై 16న ప్రారంభమైన   బిగ్ బాస్ తొలి సీజన్  నేటితో ముగిసింది. 11 కోట్ల 95 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొనడం విశేషం.

RELATED NEWS

Comment