టిటిడి 2019 డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

టిటిడి 2019 డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన గురువారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీటీడీ ముద్రించిన 2019వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు.

వీటిలో 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీ, చిన్నడైరీ, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌, శ్రీవారి పెద్ద క్యాలెండర్‌, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్‌, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్‌, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ ఉన్నాయి.

రూ.100/- విలువైన 12 పేజీల క్యాలెండర్లు 16 లక్షలు, 
రూ.130/- విలువైన పెద్ద డైరీలను 8 లక్షలు, 
రూ.100/- విలువైన చిన్నడైరీలు 2 లక్షలు, 
రూ.60/- విలువైన టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 50 వేలు, రూ.15/- విలువైన శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 4 లక్షలు, 
రూ.15/- విలువైన శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 10 వేలు, 
రూ.10/- విలువైన శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 6 లక్షలు, 
రూ.20/- విలువైన తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. 
ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీని భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా సెప్టెంబరు 14 నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, అమరనాథరెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో పోల భాస్కర్‌, బోర్డు సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED NEWS

Comment