చిక్కుల్లో ఆ మాజీ ఎంపీ.. 9 కోట్లు ఎగవేత... బ్యాంక్‌ నోటీసులు...??

చిక్కుల్లో ఆ మాజీ ఎంపీ.. 9 కోట్లు ఎగవేత... బ్యాంక్‌ నోటీసులు...??

ఉత్తరాంధ్రకు చెందిన ఆ మాజీ ఎంపీ చిక్కుల్లో పడ్డారు.. 9 కోట్ల రూపాయలను బ్యాంక్‌లకు ఎగవేశారనే ఆరోపణలతో ఆయనకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి.. రుణం తిరిగి చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని, ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న ఆ మాజీ ఎంపీ బ్యాంకు నోటీసులతో అడ్డంగా బుక్‌ అయ్యారనే వాదన వినిపిస్తోంది.. 
 
 
ఉత్తరాంధ్రకు చెందిన ఆ మాజీ ఎంపీ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బాగా క్లోజ్‌ అనే ఇమేజ్‌ ఉంది. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ముద్ర దక్కించుకున్నారు.. ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడగలరు. వైఎస్‌ మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌తోనూ మంచి రిలేషన్స్‌ మెయింటెన్‌ చేశారు.. గత ఎన్నికలకు కొద్దిగా ముందు జగన్‌, ఆ మాజీ ఎంపీ మధ్య సంబంధాలు కాస్త బెడిసికొట్టాయి. దీంతో, ఆ మాజీ ఎంపీ ప్రస్తుతం ఏదో ఒక పార్టీలో జాయిన్‌ అయ్యేందుకు రెడీగా ఉన్నారు.. రీసెంట్‌గా టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.. విశాఖ లేదా అనకాపల్లి నుంచి ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఆయనకు క్లియర్‌గా ఆఫర్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది.. 
 
ఇలాంటి సమయంలో వచ్చిన బ్యాంక్‌ నోటీసులతో ఆ మాజీ ఎంపీ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారనే టాక్‌ వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా తన ఇన్‌ఫ్లూయెన్స్‌తో బ్యాంక్‌ నోటీసులు రాకుండా నిలువరించగలిగిన ఆ మాజీ ఎంపీని ఎన్నికల ముందు అయితేనే ఇబ్బంది పెట్టగలమనే భావనతోనే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.. విశాఖ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ నుండి వచ్చిన ఆ నోటీసులలో ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని స్పష్టంగా ఉంది.. దీంతో, ఆ మాజీ ఎంపీ తీవ్ర చిక్కులలో పడ్డారనే వాదన వినిపిస్తోంది.. మరి, దీనిని ఆయన ఎలా ఫేస్‌ చేస్తారో చూడాలి.. 

RELATED NEWS

Comment