ఆళ్ళగడ్డలో వైసీపీ ఖాళీ! 

ఆళ్ళగడ్డలో వైసీపీ ఖాళీ! 

- టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో భారీగా వలస
- సీఎం నివాసంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిక
- డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు టీడీపీలో చేరిక.
- వైసీపీ  నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన సీఎం.
కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో భారీగా వైసీపీ శ్రేణులు టీడీపీ గూటికి చేరాయి. మంత్రి భూమా అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిల  ఆధ్వర్యంలో భారీగా నాయకులు  సీఎం నివాసంలో చంద్రబాబునాయుడు సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, మహిళా, మైనారిటీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 పి.చింతకుంట్ల నగర పంచాయితీ పరిధిలో 200 మంది వైసీపీ  నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ  నాయకులకు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన సీఎం, ఆళ్ళగడ్డ అభివృద్ధి కి పట్టం కట్టాలని సూచించారు. కేసీ కెనాల్ డిస్టీబ్యూటరీ ఛైర్మన్‌ సిద్దం రెడ్డి జాఫర్రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్ శ్రీ విద్య, మాజీ సర్పంచ్‌ మహబూబ్ భాషా, వార్డు మెంబర్లు మేకల లక్చీనారాయణ, టి సుబ్బనర్సయ్య, నరసింహుడు, పెద్దబాలచంటి, చింతకుంట మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, భాగ్య‌న‌గ‌రం గ్రామానికి చెందిన కె.సురేంద్ర‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, బ్ర‌హ్మ‌య్య‌, తుల‌శీరెడ్డి, కె.శ్రీనివాసులు, రామ‌చంద్రాపురానికి చెందిన కంటు ల‌క్ష్మీనారాయ‌ణ‌, బ‌త్తిన వెంక‌టేశ్వ‌ర్లు  తదితరులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమం లో కర్నూలు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రమేష్ నాయుడు, చైతన్య కూడా పాల్గొన్నారు. 

RELATED NEWS

Comment