టీ టీ డీ పాలక మండలి ప్రమాణ స్వీకారం

టీ టీ డీ పాలక మండలి ప్రమాణ స్వీకారం

టీ టీ డీ నూతన పాలక మండలి శనివారం కొలువు తీరింది. అనేక వివాదాల అనంతరం చైర్మెన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయం లో ఉదయం 11 -30  గంటలకు చైర్మెన్ తో పాటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, బొండా ఉమా మహేశ్వర రావు, గౌతు శ్యాం సుందర్ శివాజీ, ఈ పెద్ది రెడ్డి, డొక్కా జగన్నాథం, పొట్లూరి రమేష్ బాబు, రుద్ర రాజు పద్మరాజు,  చల్లా రామచంద్రారెడ్డి, మేడా రామకృష్ణా రెడ్డి ప్రమాణం చేశారు. టీ టీ డీ ఈ ఓ అనిల్ కుమార్ సింఘాల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఎక్స్ అఫిసియో సభ్యులుగా ప్రమాణం చేశారు. మన్మోహన్ సింగ్ మాత్రం ఆంగ్లం లో ప్రమాణం చేయగా, మిగిలిన వారంతా తెలుగులో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే అనిత, మహారాష్ట్ర బీ జే పీ మంత్రి సతీమణి సప్న నియామకాలు వివాదం కావడం తో ప్రమాణ స్వీకారానికి రాలేదు. సభ్యులుగా నియమితులైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రమాణాలు స్వీకారానికి హాజరు కాలేదు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, ఎం పీ సీ ఎం రమేష్, తుడ చైర్మెన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర నాయకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. సామాన్య భక్తులకు మెరుగైన వసతుల కల్పన, శ్రీవారికి భక్తులిచ్చిన సొమ్ముకు భద్రత కల్పించడమే తమ ప్రాధాన్యత అని చైర్మెన్ సుధాకర్ యాదవ్ ఐడ్రీమ్ కు చెప్పారు

RELATED NEWS

Comment