శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు  సర్వం సిద్ధం : టీటీడీ ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌

శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

  • గంట ముందే వాహనసేవలు ప్రారంభం * ఏడు గంటలకే గరుడోత్సవం * 16, 17వ తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు * 9 కోట్లతో విద్యుత్ అలంకరణలు * 26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం * 31 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు * 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, * 12 అంబులెన్సులు తిరుమల, 11 సెప్టెంబర్ 2018 (కలియుగ నారద) : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు(సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు), నవరాత్రి బ్రహ్మోత్సవాల(అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు)కు సర్వం సిద్ధమైందని, విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో పోల భాస్కర్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 13న ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. గరుడసేవ సందర్భంగా సెప్టెంబరు 16, 17వ తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామని, అదేవిధంగా సెప్టెంబరు 17న సర్వదర్శనం టోకెన్లు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను రద్దు చేసినట్టు తిరుమల జెఈవో శ్రీనివాస రాజు తెలిపారు. ఇంకా.... ...................................... గంట ముందే వాహనసేవ ప్రారంభం ................................. ఆగమపండితుల సలహా మేరకు ఈ బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహనసేవను ఒక గంట ముందుగా ప్రారంభించి రాత్రి 8 నుండి 10 గంటల వరకు, గరుడవాహనసేవను అరగంట ముందుగా రాత్రి 7 గంటలకు ప్రారంభించి రాత్రి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. * భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతలు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. * భక్తుల కోసం రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ................................ 9 కోట్లతో విద్యుత్ అలంకరణలు 26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం .............................. * శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్‌, పుష్పాలంకరణలు * దాదాపు రూ.9 కోట్లతో విద్యుత్‌ అలంకరణలు, పెయింటింగ్‌, బారికేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులు * తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం . ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ మాడ వీధులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చారు. ఆలయ నాలుగు మాడవీధులు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనంగా 800 మంది పారిశుద్ధ్య సిబ్బంది. 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, 12 అంబులెన్సులు అందుబాటులో వుంటాయి. ................................. 31 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు .............................. వాహనసేవలను తిలకించేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తిరుమల, నడకమార్గాల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించటం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం, విద్యాసంస్థలు, కల్యాణమండపాలు, బస్టాండు, రైల్వేస్టేషన్‌, అన్ని ముఖ్య కూడళ్లలో స్వాగత ఆర్చిలు, విద్యుద్దీపాల కటౌట్లు ఏర్పాటు ................................... గరుడసేవ నాడు.... ................................. గరుడసేవ నాడు గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల తాగునీటి ప్యాకెట్లు తిరుమలలో 7 వేల వాహనాలు పార్కింగ్‌ గరుడసేవ నాడు ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాలను నిషేధం తిరుపతిలో పార్కింగ్‌ ప్రదేశాల ఏర్పాటు ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు 8 ప్రాంతాల్లో క్రేన్లు, ఆటోమొబైల్‌ క్లినిక్‌ వాహనాలు ........................ పటిష్టమైన భద్రత .................... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిఘా, భద్రతా విభాగం, పోలీసులతో సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు పోలీసులకు బాడివోర్న్‌ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ 3 వేల మంది పోలీసులు, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. ................................. కాటేజీ దాతలకు సూచనలు ............................... బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ సందర్భంగా సెప్టెంబరు 15 నుండి 17వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ సందర్భంగా అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. రెండు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు స్థానిక కళాకారులతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, హర్యానా, మణిపూర్‌, పాండిచ్చేరి రాష్ట్రాల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ................................ ఓం నమో వేంకటేశాయ

RELATED NEWS

Comment