జగిత్యాలలో ప్రేమదేశం.. ప్రేమించిన యువతి కోసం ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య.....!

జగిత్యాలలో ప్రేమదేశం.. ప్రేమించిన యువతి కోసం ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య.....!

 


దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ప్రేమదేశం సినిమా గుర్తుందా మీకు..? అప్పట్లో ఆ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఒకే యువతిని ఇద్దరు ఫ్రెండ్స్‌ ప్రేమించడం, చివరికి వారిద్దరినీ తన ఫ్రెండ్స్‌గా భావిస్తానని ఆమె చెప్పడం కథతో వచ్చిన ఈ సినిమా ఓ సెన్సేషన్‌.. సేమ్‌ టు సేమ్‌ ఇలాంటి లవ్‌ స్టోరీనే తెలంగాణలోని జగిత్యాలలో జరిగింది.. ఈ టెన్త్‌ క్లాస్‌ లవ్‌ స్టోరీ చివరికి విషాదాంతంగా ముగియడం సంచలనంగా మారుతోంది..


జగిత్యాల టౌన్‌లోని విజయపురి కాలనీకి చెందిన కూసరి మహేందర్‌, విద్యానగర్‌కు చెందిన బంటు రవితేజ ఫ్రెండ్స్‌. ఇద్దరూ కలిసి స్థానిక మిషనరీ పాఠశాలలో టెన్త్‌ క్లాస్‌ చదువుతున్నారు. ఇద్దరూ కలిసి కొన్నాళ్లుగా అదే క్లాస్‌కి చెందిన ఓ యువతిని ప్రేమించారు... ఆమెకూ ఇద్దరూ లవ్‌ ప్రపోజల్‌ చేశారట.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఆ అమ్మాయి కోసం గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా ఇదే విషయంపై మాట్లాడుకోవడానికి ఇద్దరూ టౌన్‌లోని మిషన్‌ కాంపౌండ్‌ దగ్గరికి చేరుకున్నారు.. బీరు బాటిళ్లు తెచ్చుకున్నారు.. ఫుల్‌గా డ్రింక్‌ చేశారు.. ఆ తర్వాత మాట్లాడుకుందామని ఒకచోట కూర్చుకున్నారు.

మాటల మధ్యలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.. గాళ్‌ ఫ్రెండ్‌ కోసం అది ఫైట్‌గా మారింది. ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరినొకరు గాయపరుచుకున్నారు.. ఏం జరిగిందో ఏమో.... ముందుగానే ఇద్దరూ బీరు బాటిల్స్‌తోపాటు పెట్రోల్‌ బాటిల్స్‌ సైతం తెచ్చుకున్నారు.. రగడ శృతిమించడంతో ఒకరిపై ఒకరు పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు..

మిషన్‌ కాంపౌండ్‌లో మంటలు చెలరేగడం చూసిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించి మంటలను ఆర్పారు.. అప్పటికే తీవ్రంగా గాయపడిన మహేందర్‌ స్పాట్‌లోనే చనిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రవితేజను కరీంనగర్‌ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు..
పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.. ప్రేమ వ్యవహారమే ఘర్షణకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.. అయితే, ఘటనా స్థలంలో మూడో వ్యక్తి కూడా ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.. దీనిపై విచారణ జరుపుతున్నారు.. ఒకటీ రెండు రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.. టీనేజ్‌ లవ్‌ స్టోరీలు వికటించి తీవ్ర పరిణామాలకు దారితీయడం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది..

 

RELATED NEWS

Comment