అన్న అక్కర్లేని స్టార్ తమ్ముడు..  

అన్న అక్కర్లేని స్టార్ తమ్ముడు..  

అన్నంటే ఆ తమ్ముడికి ఎనలేని అనురాగం. తమ్ముడంటే ఆ అన్నకు అంతులేని ప్రేమ. కానీ ఇవన్నీ పబ్లిక్ లోనే. పర్సనల్ గా ఎవరికి వారే.. ఇంకా చెప్పాలంటే వేదికలపైనా ఆ ఇద్దరూ అనురాగం నిండిన అన్నదమ్ములుగా భలే నటిస్తారు అని దగ్గర్నుంచీ చూసిన ఎవరైనా ఒప్పుకుంటారు. కాకపోతే ఇందులో చిన్న మతలబు ఏంటంటే.. అన్నకు తమ్ముడంటే నిజంగానే ఇష్టమేట. కానీ తమ్ముడే అన్నంటే ప్రేమని అన్ని వేదికలపైనా నటిస్తాడు. ఇంతకీ ఈ అన్నదమ్ములెవరో చెప్పలేదు కదూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఏంటీ షాక్ అయ్యారా..? అఫ్ కోర్స్ వీరి స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసిన ఎవరైనా  ఇప్పుడు అది నిజం కాదని తెలిసిన అలాగే షాక్ అవుతారు. అది సరే మరి తమ్ముడికి ఎందుకు అన్నంటే ఇష్టం లేదు..? ఈ ఇద్దరికీ చెడిందా..? లేక అసలు ‘ఒరిజినల్’గా కుదరకపోయినా.. ఎవరి కోసమైనా అన్నదమ్ములుగా  అడ్జెస్ట్ అవుతున్నారా.. అనే డౌట్స్ రాకమానవు. అసలు విషయం ఏంటంటే.. 
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కంపేరిజన్ కూడా అవసరం లేనంత పెద్ద స్టార్. ఆ స్టార్డమ్ ఊరికే రాలేదు కదా. అన్నదమ్ములుగా ఇప్పుడు వీరు వెలిగిపోకముందే ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎలివేట్ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం ఇద్దరూ కలిశారు. అన్నా, ‘నాన్నా’ అని ఆప్యాయంగా పిలుకోవడమే కాదు.. ఆ అనురాగం నిజమే అని అంతా అనుకునలా చేశారు. కానీ వాస్తవం వేరు అంటోంది పరిశ్రమ. తనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత తనను చేరదీసిన అన్నలైనా, తమ్ముళ్లైనా యంగ్ టైగర్ కు మనస్ఫూర్తిగా ఇష్టం ఉండదంటోంది. ఆ కారణంగానే అన్నకు బహిరంగంగా చాలా చేసినా ఇంటర్నల్ గా దూరంగానే ఉంటాడు అంటారు చాలామంది. అది నిజమే అనడానికి ఈ మధ్య కాలంలోనే చాలా ఉదాహరణలున్నాయి. 
‘జై లవకుశ సినిమా తన వల్లే ఆడింది’ అనేది ఎన్టీఆర్ బలమైన నమ్మకం. ఆ సినిమాకు ముందు కళ్యాణ్ రామ్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. ఈ మూవీతో అవన్నీ క్లియర్ చేశాడు. ఇక ఆ తర్వాత మళ్లీ అన్న గురించి మాట్లాడింది లేదు.. పట్టించుకున్నదీ లేదు. ఇంకా చెప్పాలంటే కొంతకాలం వరకూ కళ్యాణ్ రామ్ ను పక్కనబెట్టే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. అందుకే రీసెంట్ గా అతని ఎమ్మెల్యే సినిమాకు సంబంధించిన ఏ ఫంక్షన్ లోనూ పాల్గొనలేదు. ఎవరైనా అడిగితే తన లేటెస్ట్ మూవీ కోసం మేకోవర్ చేసుకున్న కొత్త లుక్ రివీల్ అవుతుంది.. అందుకే రాలేదు అన్నారు. మరి అది నిజమే అయితే ఆయన ఐపిఎల్ బ్రాండ్ అంబాసిడర్ గా బయటకు వచ్చాడు కదా.. ఆ ప్రోమో షూటింగ్స్ లో తన పిక్స్ బయటకు వచ్చాయి కదా. అంటే అన్న కోసం వస్తే లుక్ రివీల్ అవుతుంది. బయట రివీల్ అయినా ఫర్వాలేదు. ఇలా రివీల్ అయినా డబ్బులు వస్తాయి.. కానీ అన్నకోసం వెళితే ఏమొస్తుంది. పైగా ఆ కాసేపూ తెగ నటించాలి.. అనేది ఎన్టీఆర్ ఫీలింగ్ అనుకోవచ్చు. 
అంతేకాదు.. ఈ నెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మరో సినిమా ఫంక్షన్ కు కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు ఎన్టీఆర్. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భరత్ అనేనేను మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆరే చీఫ్ గెస్ట్. మరి ఇప్పుడు లుక్కు రివీల్ కాదా..? మరి ఇప్పుడు లేని ఇబ్బంది ఎమ్మెల్యే ఫంక్షన్ కో, కళ్యాణ్ రామ్ కోసమో వస్తే వచ్చిందా..? దీన్ని బట్టే ఎన్టీఆర్ ఎంత స్ట్రాటజిక్ గా కళ్యాణ్ రామ్ ను పక్కన బెడుతున్నాడనే విషయం అర్థమౌతోంది. అయితే కొన్నాళ్ల క్రితం వరకూ కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ గురించి అడిగితే చాలా చెప్పేవాడు. కానీ ఇప్పుడు పెద్దగా మాట్లాడ్డం లేదు. అడిగినా కూడా చాలా తక్కువగా తమ్ముడి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధంలో నిజమెంత అనేది తెలియదు కానీ.. వేదికలపై ప్రేమలు మాత్రం వెరైటీగా ఉన్నాయి. నిజానికి ఎమ్మెల్యే ఫంక్షన్స్ కు ఎన్టీఆర్ అటెండ్ అయి ఉంటే రేంజ్ మరోలా ఉండేది. కానీ అతను రాలేదు.. లేదు రావాలనుకోలేదు అంటున్నారు చాలామంది. తన రేంజ్ వేరు.. అన్న రేంజ్ వేరు.. తమకంటే మహేష్ బాబు రేంజ్ వేరు. అందుకే అన్న కంటే మహేష్ బాబుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఈ అన్న అక్కర్లేని తమ్ముడు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతాడో కానీ.. ఎన్టీఆర్ ప్రేమలో నిజమెంత అనే ప్రశ్నలోనే అనుమానం ఉంది... అది నిజం. 

RELATED NEWS

Comment