నిర్మాతల పాలిట విలన్...?

 నిర్మాతల పాలిట విలన్...?

రంగస్థలం ఫ్లాప్ అవుతుందా..? ఈ విషయం ఎంటైర్ టీమ్ కూ ముందే తెలుసా..? ముఖ్యంగా రామ్ చరణ్ కు.. అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం కానీ.. రామ్ చరణ్ ప్రవర్తన చూస్తే అది నిజమే అనిపించక మానదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చరణ్.. ఆ మెగా బిహేవియర్ చూపించడంలో విఫలం అవుతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. ఒక సినిమాపై దర్శకుడికెంత బాధ్యత ఉంటుందో అంతకు మించి హీరో చూపించాలి. కానీ రంగస్థలం విషయంలో రామ్ చరణ్ ప్రవర్తన వింతగా ఉంది. ప్రమోషన్స్ కు సహకరించడం లేదు. అటు సినిమా గురించి హైప్ తెచ్చే ఏ ప్రయత్నమూ చేయడం లేదు. ఈ సినిమా గురించి ఎక్కడా పాజటివ్ గా మాట్లాడ్డం లేదు. ఎందుకు..? ఎందుకంటే చరణ్ సినిమా రిజల్ట్ ముందే తెలుసు.. ఇదే కొందరు చెబుతోన్న వాస్తవం.. మరి ఈ వాస్తవంలో నిజాలెన్ని..?రంగస్థలం ఓ పీరియడ్ ఫిల్మ్. 1980ల నాటి నేపథ్యంతో సాగే కథ. ఆ కథ ఎందరిని ఆకట్టుకుంటుందనేది పెద్ద ప్రశ్న. పైగా ఇప్పుడు యూత్ ఫుల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఆ యూత్ ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేరనేది నిజం. అటు ఓవర్శీస్ నుంచి కూడా సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఇక్కడ కూడా ఇది పూర్తిగా ఒక్క ప్రాంతానికే సంబంధించిన కథ. అంటే ఇతర ప్రాంతాలకు కనెక్ట్ కావడం దాదాపు కష్టం. ఇక ఇప్పటి వరకూ వచ్చిన పాటలు హిట్ అంటున్నారు.. కానీ పాటలు హిట్ అయ్యి సినిమాలు డిజాస్టర్ అయిన సందర్భాలెన్ని లేవు. ఆ లిస్ట్ లోకే రంగస్థలం కూడా చేరుతుందనే సంకేతాలు చాలా కనిపిస్తున్నాయి. రంగస్థలం సినిమా నిడివి ఏకంగా మూడుగంటలకు పైనే అంటున్నారు. దాన్ని తగ్గించేందుకు నిర్మాతలతో కలిసి చరణ్ ప్రయత్నించినా సుకుమార్ ఒప్పుకోలేదట. పీరియడ్ ఫిల్మ్ ను అంతసేపు చూడ్డం సాధ్యమా అనేది పెద్ద ప్రశ్న. ఇక సినిమా కథ కూడా ముందే తెలిసిపోతుంది. 1980ల నాటి కథే అయినా ఇది కూడా రొటీన్ రివెంజ్ డ్రామానే అంటున్నారు. ఆ రొటీన్ ఫీల్ రాకుండా చేయడానికే ఈ నేపథ్యం ఎంచుకున్నారంటున్నారు. 
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని డ్రా బ్యాక్స్ ఉన్నా.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో పూనుకుంటే ఖచ్చితంగా హైప్ డబుల్ చేయొచ్చు. డబుల్ వరకూ కాదు. సాధారణ హైప్ పెంచడానికి కూడా రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నిజానికి ఈ సినిమాకు యేడాది టైమ్ పట్టిందని చెబుతున్నారు. ఆ టైమ్ అంతా సుకుమార్ తనపైనే వేసుకున్నాడు. కానీ ఇందులో చాలాభాగం చరణ్ వల్లే లేట్ అయిందనేది అందరికీ తెలుసు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తోన్న సైరా నరసింహారెడ్డి సినిమా కోసం రంగస్థలం కు చాలా సార్లు డుమ్మా కొట్టాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం, ఆర్టిస్టుల సెలక్షన్ కోసం, టెక్నీషియన్స్ మార్పుల కోసం.. ఇలా చాలాసార్లు రంగస్థలం సినిమా షూటింగ్ చరణ్ వల్లే విపరీతంగా లేట్ అయిందనేది అందరికీ తెలుసు. పీరియాడిక్ సినిమాలకు సెట్ ప్రాపర్టీస్, ఆర్ట్ వర్క్, మేకప్ చాలా ఉంటుంది. ఇలా షెడ్యూల్స్ లో మార్పులు వస్తే ఆ ఖర్చు రెండింతలవుతుంది. అవన్నీ తెలిసిన చరణ్.. ఇప్పుడు ప్రమోషన్స్ కు మొహం చాటేయడం ఏమాత్రం బాగోలేదని నిర్మాతలు తెగ ఫీలవుతున్నారు. కానీ సినిమా విడుదల ముందు ఇవన్నీ చెప్పుకుంటే మళ్లీ తమకే లాస్ అని కామ్ గా ఉండిపోతున్నారు. అటు సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఈ సినిమాను ఎంతో ప్రేమించి చేశానని చెబుతోన్న చరణ్ ఆ ప్రేమను ప్రమోషన్స్ లో కూడా చూపించాలి కదా.. కానీ చూపించడం లేదు. 
మరోవైపు రంగస్థలం థియేటర్స్ విషయంలో కూడా మరీ ఎక్కువ థియేటర్స్ కావాలని ఎవరూ అడగడం లేదని తెలుస్తోంది. అసలు పోటీయే లేని డేట్ లో కూడా థియేటర్స్ ను తీసుకోవడం లేదంటే చాలా అర్థాలు వెదకాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చరణ్ ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏ మీడియాతోనూ సరిగా సహకించడం లేదు. ఏదో ఒకటీ అరా చానల్స్ కు మాత్రం ఇంటర్వ్యూలిచ్చాడు. ఇటు చూస్తే రిలీజ్ డేట్ దగ్గరపడింది. మరి రామ్ చరణ్ ఎందుకు ప్రమోషన్స్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదో కానీ.. అతని తీరువల్ల నిర్మాతలు హైరానా పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తానూ ఓ నిర్మాత అయి ఉండి చరణ్ ఇలా చేయడం మాత్రం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే ఆల్రెడీ రిజల్ట్ తెలిసిన సినిమాకుప్రమోషన్స్ తో అనవసరంగా హైప్ పెంచడం ఎందుకు అనుకుంటున్నాడా చరణ్.. లేక ఇంకేదైనా ఇంటెన్షనల్ ఐడియా ఉందా..? ఏదేమైనా రామ్ చరణ్ ఇప్పుడు రంగస్థలం నిర్మాతల పాలిట విలన్ గా మారాడంటున్నారు.. చాలామంది.

RELATED NEWS

Comment