2019ల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేది మేమే: పవన్‌కల్యాణ్

2019ల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేది మేమే: పవన్‌కల్యాణ్

వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధిం చి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంనుంచి పవన్ బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దల ఆశీస్సులు, యువత మద్దతు, అక్కాచెల్లెళ్ల తోడుతో కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై అవగాహన కోసమే పోరుయాత్ర చేస్తున్నామని, మలిదశలో వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. చంద్రబాబుపై కూడా విరుచుకుపడ్డారు. జనసేనకు సంస్థాగత నిర్మాణంలేదని విమర్శించడం టీడీపీకి చాలా తేలికని, కానీ టీడీపీని చంద్రబాబు స్థాపించలేదని, ఎన్టీఆర్ స్థాపించిందని గుర్తుచేశారు. చంద్రబాబులా తనకు హెరిటేజ్‌లాంటి సంస్థలులేవని, తనకున్నది ప్రజాబలం మాత్రమేనన్నారు. బానిసగా ఉండలేకే టీడీపీని వ్యతిరేకించానని చెప్పారు. ఢిల్లీలో కూర్చుని ఆడిస్తే ఆడే బొమ్మను కాదని, భయపడే వ్యక్తినయితే రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదని పవన్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే శత్రువులకు కూడా న్యాయం చేస్తామని అన్నారు.

RELATED NEWS

Comment