రాష్ట్రపతికి ఘనస్వాగతం 

రాష్ట్రపతికి ఘనస్వాగతం 

కుటుంబ సమేతంగా నగరానికి రాక రాజ్‌భవన్‌లో బస - గవర్నర్‌ విందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఘనస్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, సతీమణి సవితా కోవింద్‌, కుమార్తె స్వాతి కోవింద్‌లతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి గౌరవార్థం ఆయనకు, కుటుంబ సభ్యులకు గవర్నర్‌ దంపతులు విందు ఇచ్చారు. రాష్ట్రపతి ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతారు. 10.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటుతారు. తర్వాత హెలికాప్టర్‌లో కందిలోని హైదరాబాద్‌ ఐఐటీకి చేరుకొని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరి వెళతారు.

RELATED NEWS

Comment