న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుద‌ల కానున్న  ప్రేమ‌తో మీ కార్తిక్‌

న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుద‌ల కానున్న  ప్రేమ‌తో మీ కార్తిక్‌

 
మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. షాన్ రెహ‌మాన్ అందించిన ఆడియో అండ్ వీడియో సాంగ్ ని స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సాంగ్ కి దాదాపు 1.5 మిలియ‌న్‌ డిజిట‌ల్ వ్యూస్ రావ‌టం విశేషం. చిత్రం విడుద‌ల కి ముందే ప్ర‌మెష‌న్ నిమిత్తం ఫుల్ సాంగ్ ని విడుద‌ల చేయ‌టం కూడా తెలుగు లో ఇదే మెట్ట‌మెద‌టిసారి కావ‌టం విశేషం. ఇదిలా వుంటే సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగ్ అందించిన సినిమాటోగ్ర‌ఫి విజ‌వ‌ల్ గా గ్రాండియ‌ర్ గా వుండ‌టంతో ఇంత‌లా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి సంభందించిన ట్రైల‌ర్ ని త్వ‌ర‌లో విడుల చేయ‌నున్నారు. చిత్రాన్ని న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.  
 
ద‌ర్శ‌కుడు రిషి మాట్లాడుతూ - `` మెస్ట్ స‌క్స‌స్ ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ విడుద‌ల చేయ‌టం శుభ‌ప్ర‌దం గా భావిస్తున్నాము. ఎందుకంటే చిన్న చిత్రం లో ఓ సాంగ్ కి 1.5 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ రావ‌టం విశేషం. అది దిల్ రాజు గారి హ‌స్త‌వాసు అని న‌మ్ముతున్నాను. అలాగే మా చిత్రం మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ఆద‌రణ పొందుతుంది. ఊరు వ‌దిలి విదేశాలు వెల్లిన ఓ కొడుకు త‌ను కొల్పోయిన జీవితాన్ని త‌న కొడుకుకి ఇవ్వాల‌ని చేసిన ప్ర‌య‌త్నంమా చిత్ర మూల‌క‌థ‌. సీనియ‌ర్ న‌టులు గొల్ల‌పూడి మారుతిరావు గారు, ముర‌ళి శ‌ర్మ గారు చాలా మంచి పాత్రల్లో న‌టించారు. మా చిత్రానికి సంభందించిన ట్రైల‌ర్ ని త్వ‌ర‌లో విడుదల చేస్తాము. చిత్రాన్ని న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుదల చేస్తాము.. అని అన్నారు
 
నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ.. ప్రేమ‌తో మీ కార్తిక్ చిత్రానికి సంభందించిన సాంగ్ ని విడుదల చేశాము. ఇప్ప‌టికి 1.5 డిజిట‌ల్ వ్యూస్ రావ‌టం విశేషం. మా అన్న‌య్య గారి అబ్బాయ్ కార్తిక్ హీరో గా చేస్తున్నాడు. మాకు అన్నివిధాల స‌హ‌క‌రిస్తున్న మీడియా వారికి మా ధ‌న్య‌వాదాలు.  అలాగే అతి త్వ‌ర‌లో చిత్రం యెక్క టీజ‌ర్ ని లాంచ్ చేస్తాము. న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాము. అని అన్నారు
 
కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌గ‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి 
 
సాహిత్యంః శ్రీమ‌ణి, ఎడిట‌ర్ః మ‌ధు, ఆర్ట్ః హ‌రివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌, నిర్మాతః ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః రిషి.

RELATED NEWS

Comment