వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 15వరోజు షెడ్యూల్

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 15వరోజు షెడ్యూల్

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు మర్రికుంట క్రాస్రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు.
భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు బాలాపురం క్రాస్రోడు చేరుకుంటారు. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 4.30 గంటలకు పెండెకల్ చేరుకొని.. వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం 7 గంటలకు వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్రోడ్కు చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు.

RELATED NEWS

Comment